కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా ఎర్రవల్లి (Erravelli) లోని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ (KCR Farmhouse) వద్ద రాజకీయ వేడి తీవ్రస్థాయికి చేరింది. మంగళవారం దళిత కాంగ్రెస్ శ్రేణులు సుమారు వెయ్యి డప్పు చప్పుళ్లతో భారీ ఎత్తున ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నాయకుల రాకతో తమ నాయకుడి వ్యవసాయ క్షేత్రం అపవిత్రమైందని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో ఫామ్‌హౌస్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. అనంతరం క్షేత్రం చుట్టూ ఉన్న పరిసరాలను పసుపు, నీళ్లతో కడిగి ప్రత్యేకంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ ఘటనతో ఎర్రవల్లి ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతుంది.

