కలం, నిర్మల్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఈ నెల 10 నుంచి 17 వరకు గ్రామగ్రామాన నిర్వహించాలని సీపీఎం నిర్మల్ (Nirmal CPM) జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్ వద్ద వారోత్సవాల కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్‌కుమార్ మాట్లాడుతూ.. భూస్వాములు, జాగీర్దారులు, దొరల దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. పోరాట చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ప్రజలు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొమ్మెన సురేష్, డాకుర్ తిరుపతి, బర్కుంట గంగారం, నాగుల నర్సాగౌడ్, చింతకుంట శంకర్ తదితరులు పాల్గొన్నారు.

