కలం, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పార్టీ అక్రమ చర్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన శాంతియుత నిరసనలను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు పాల్పడుతున్నారని కరీంనగర్ జిల్లా BRS అధ్యక్షుడు జి.వి. రామకృష్ణ రావు (GV Ramakrishna Rao) తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున మానకొండూర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు జీవీ రామకృష్ణ రావును హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ జిల్లా, మండల స్థాయి నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు.
ఈ సందర్బంగా జి.వి. రామకృష్ణ (GV Ramakrishna Rao) మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అలాంటి హక్కులను కాలరాయడం దారుణమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నిరంకుశంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు.
వెంటనే అక్రమ అరెస్టులను నిలిపివేసి, జిల్లావ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
Also Read : 823 రోజులు మాత్రమే, వదిలిపెట్టం.. కేటీఆర్ ఆగ్రహం
Follow Us On: X(Twitter)

