నర్సాపూర్ ZPHS అభివృద్ధికి రూ. 12.50 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే ఏలేటి

కలం, నిర్మల్: నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ (తెలంగాణ పబ్లిక్ స్కూల్) అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సమగ్ర శిక్ష పథకం కింద రూ.12.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ( MLA Alleti ) మంగళవారం తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు అందించడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అభివృద్ధికి రూ.12.50 కోట్ల నిధులు మంజూరు కావడంతో విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా వాతావరణం, ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read : మండలిలో హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>