పోలీసుల అతివేగం.. జర్నలిస్ట్ కు తీవ్ర గాయాలు

కలం, మెదక్ బ్యూరో : మెదక్ (Medak) జిల్లా అల్లాదుర్గంలో నాందేడ్-అఖోలా 161వ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతల నడుమ విధుల్లో ఉన్న ‘సాక్షి’ పేపర్ రిపోర్టర్‌ ను పోలీసు వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్ర గాయాలైన వీరేందర్ ను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ ధర్నాకు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్ఎస్ నేతల ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ను అరెస్ట్ చేసి బలవంతంగా అల్లాదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసు వాహనం అతివేగంగా వెళ్తున్న క్రమంలో.. అక్కడే ఉండి ఈ ఘటనను కవరేజ్ చేస్తున్న ‘సాక్షి’ పేపర్ రిపోర్టర్ వీరేందర్‌ను ఆ పోలీస్ వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రిపోర్టర్ వీరేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన తోటి జర్నలిస్టులు, స్థానికులు 108 వాహనం ద్వారా ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జర్నలిస్టు వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>