ఉత్తమ క్లబ్‌గా ‘కరీంనగర్ మానేరు లయన్స్’.. శంకర్ గౌడ్‌కు అవార్డు

కలం, కరీంనగర్: సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు సేవలందిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మానేరు మరో ప్రతిష్టాత్మక గుర్తింపును సొంతం చేసుకుంది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320G పరిధిలో నిర్వహించిన సేవా కార్యక్రమాలు, క్లబ్ పనితీరును పరిగణనలోకి తీసుకుని మానేరు క్లబ్‌ను ఉత్తమ క్లబ్‌గా ఎంపిక చేశారు.

క్లబ్ అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్‌కు ‘బెస్ట్ ప్రెసిడెంట్’ అవార్డు లభించగా, జిల్లాలోని MJF (మెల్విన్ జోన్స్ ఫెలో) విభాగంలోనూ కరీంనగర్ మానేరు క్లబ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంజేఎఫ్ ఏరియా లీడర్ లయన్ దీపక్ భట్టాచార్య, 2025-26 గవర్నర్ లయన్ సింహరాజు కోదండరాములు చేతుల మీదుగా ముత్యం శంకర్ గౌడ్ అంతర్జాతీయ ప్రెసిడెంట్ పిన్, 2025-26 బ్యానర్‌తో పాటు ప్రతిష్టాత్మక ట్రోఫీని అందుకున్నారు.

ఈ సందర్భంగా ముత్యం శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. క్లబ్‌కు దక్కిన ఈ ఘనత ఒక్కరి కృషి కాదని, సభ్యులందరి సమిష్టి శ్రమ, సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు. క్లబ్ ప్రతినిధులు, సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి సమాజానికి మరింత మెరుగైన సేవలందించడమే లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రముఖులు డీజీ మోర భద్రేశం, చంద్ర ప్రకాష్, చంద్రమోహన్ గౌడ్, సింగిరెడ్డి వాసుదేవ రెడ్డి, చందా రవీందర్, వేముల విష్ణుమూర్తి, సుద్దాల రామచందర్ గౌడ్, సంద రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>