వినాయక ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి : భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్ : వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి రానున్న వినాయక ఉత్సవాల నిర్వహణపై శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని మతాల పండుగలు సహోదర భావంతో, కలిసి మెలసి జరుపుకోవాలన్నారు. వినాయక ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గణేష్ ఉత్సవాలు మొత్తం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వైర్లను సరి చేస్తామని కలెక్టర్ భవేశ్​ మిశ్రా  చెప్పారు. వినాయక నిమజ్జన కార్యక్రమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన (Bhavesh Mishra) పేర్కొన్నారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేసి శోభాయాత్రకు అనుకూలంగా మారుస్తామని వివరించారు. వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా పూర్తయ్యేందుకు నిర్వాహకులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, డిఎస్పీ శ్రీనివాస్, ఆర్డీఓ దేవీదాస్, తదితరులు పాల్గొన్నారు.

Also Read : దులీప్ ట్రోఫీలో ఇషాన్ హిస్టరీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>