ఏపీలో కొత్త పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ షురూ!

కలం, వెబ్ డెస్క్: ఏపీలో పింఛన్‌దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం (NTR Bharosa Pensions)లో భాగంగా సోమవారం నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. వారం రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకోబోతున్నారు. స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు కేంద్రాలతో పాటు గ్రామ సచివాలయాలు, వెబ్‌సైట్‌లోనూ దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచామని అధికారులు వెల్లడించారు. డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసి ఇవ్వాలని కోరారు. అక్కడికక్కడే దరఖాస్తులను ఆన్ లైన్ చేయడంతో పాటు అర్హులకు సంబంధించి ఈ–కేవైసీ ప్రక్రియ కూడా నిర్వహించబోతున్నారు.

దరఖాస్తుల షెడ్యూల్ ఇదే..

నాలుగు దశల్లో పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ చేపట్టబోతున్నారు. సోమవారం నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు అర్హులైన వారి నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు దరఖాస్తులను పరిశీలించబోతున్నారు. 22వ తేదీ నుంచి 24 వరకు క్షేత్ర స్థాయిలో దరఖాస్తుదారుల వివరాలను తనిఖీ చేయనున్నారు. చివరగా సెప్టెంబర్ 25, 26వ తేదీల్లో పింఛన్ దారుల జాబితాను ఫైనలైజ్ చేసి.. సెర్ప్ బడ్జెట్‌ ప్రతిపాదనలు పంపించబోతున్నారు. వీరికి అక్టోబర్ ఒకటో తేదీ నుంచే కొత్త పింఛన్లు (NTR Bharosa Pensions) అందించబోతున్నారు. ఆధార్​, రేషన్ కార్డులతో పాటు వితంతువులు, దివ్యాంగులు సంబంధిత ధ్రువపత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టంగా తెలిపారు.

Also Read : ఎయిర్‌పోర్టులో భీకర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>