కలం, మహబూబ్ నగర్ బ్యూరో: భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆదివారం ఏనుగొండ (Yenugonda)లో సన్నిధి ఆశ్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ ఛైర్మన్ డాక్టర్ అంబటి నటరాజు అధ్యక్షతన జరిగిన వేడుకలో రెడ్ క్రాస్ కోశాధికారి సురభి జగపతి రావు, రాష్ట్ర, జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు జి.రమణయ్య, తిరుపతి రెడ్డి, జూనియర్ రెడ్ క్రాస్ లయన్ అశ్విని చంద్రశేఖర్, లయన్ కె.అశోక్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా వక్తలు మాట్లడుతూ.. సమాజంలో గురువు కు గొప్ప స్థానం ఉందన్నారు. విద్యార్థులు క్రమ శిక్షణతో మెలిగి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం సన్నిధి ఆశ్రమం సూపరింటెండెంట్ వెంకటేశ్వరమ్మ, విద్యా బోధకులు యాదమ్మ, సునంద, శిరీష, రాజేశ్వరీని శాలువలు, పూలమాలలతో సన్మానించి జ్ఞాపికలను అందించారు.

