కలం, వెబ్‌డెస్క్: ఫ్రైడ్ చికెన్‌తో ఎంతోమంది నాన్ వెజ్ ప్రియులకు ఫేవరెట్‌గా మారిన కేఎఫ్‌సీ (KFC)లో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఫ్రెండ్స్‌తో కలిసి కేఎఫ్‌సీకి వెళ్లగా.. ఆ ఫ్రైడ్ చికెన్‌లో పురుగులు దర్శనమివ్వడం షాక్‌కు గురి చేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా (Greater Noida) వెస్ట్‌లో చోటు జరిగింది. గౌర్ సిటీ మాల్లో ఉన్న కేఎఫ్‌సీ ఔట్లెట్లో ఓ వ్యక్తి చికెన్ కొనుగోలు చేశాడు. అందులో పురుగులు వచ్చాయని ఆరోపిస్తూ ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతడు పోస్ట్ చేసిన ఫోటోల్లో ఒక పురుగు స్పష్టంగా కనిపిస్తోంది. సదరు వ్యక్తి తన పోస్టుకు కేఎఫ్‌సీ ఇండియాను ట్యాగ్ చేస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
గౌర్ సిటీ మాల్లో ఉన్న కేఎఫ్‌సీ ఔట్లెట్ నాణ్యతా ప్రమాణాలపై కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇక్కడే ఇలా ఉందా? ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాగే పురుగులు వస్తున్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ చికెన్ ముక్కలను చూడకుండా తింటే పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఫేమస్ అయిన కేఎఫ్సీలో ఆహార భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

