కలం, వెబ్‌డెస్క్: నెల్లూరు (Nellore)లోని కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఏసీబీ (ACB)అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డబ్బుతో అధికారులకు పట్టుబడ్డాడు. బ్రేక్ ఇన్స్‌పెక్టర్ వాహనాలను నిలిపి భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ గోపి నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఆయన వద్ద నుండి 2.48 లక్షల రూపాయల నగదుతో పాటు ఒక కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు ఏ పరిస్థితుల్లో, ఎవరెవరి దగ్గర నుంచి వసూలు చేశారనే అంశంపై ఏసీబీ అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

