మేం మాట్లాడితే తట్టుకోరు.. కొండా మురళీ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంపై ఆమె భర్త కొండా మురళీ (Konda Murali) స్పందించారు. ‘ఇదేం కొత్త కాదు, ఉన్నది ఉన్నట్లు, కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడితే ఎవరూ తట్టుకోరు. ఇవాళ మేం, రేపు ఎవరో. పదవులున్నా లేకున్నా మా గౌరవం మాకు ఉంటుంది. మేము ప్రతిదానికీ స్పందిచకపోవచ్చు. కానీ, ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటాం. అన్ని దరిద్రాలు ఏకమై మా మీద చేస్తున్న రాజకీయ దాడులకు గట్టిగా నిలబడుతాం. మొండిగా ఎదురు వెళ్లగలం’ అని పేర్కొన్నారు.

త్వరలోనే అనుచరులతో సమావేశం..

మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన నేపథ్యంలో త్వరలోనే అనుచరులతో కొండా వర్గీయులు సమావేశం కాబోతున్నట్లు చర్చ జరుగుతోంది. వరంగల్ లో నిర్వహించే ఈ భేటీలో.. ఇక నుంచి రాజకీయ పరంగా ఎలా ముందుకు వెళ్లాలనేది తేల్చుకోనున్నారు. పార్టీలో నుంచి వెళ్లనని కొండా సురేఖ స్పష్టం చేసిన నేపథ్యంలో, ఆమె ఎలా వ్యవహరించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>