కలం, నిర్మల్: నిర్మల్(Nirmal) జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ అధికారుల సంఘం (Police Association) ఎన్నికలు గురువారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఎన్నికల ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా దండేకర్ సాయి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కృష్ణ, సాయి కృష్ణ, కార్యదర్శిగా శ్రీకాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రామ్ నిరంజన్, జాయింట్ సెక్రటరీగా సంతోష్, కోశాధికారిగా మాధవ్ ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా మహేందర్ రెడ్డి, సాయి కిరణ్ జాదవ్, శంభు, గంగాధర్, పెర్సిస్, టి.వి. రమణ ఎన్నికయ్యారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు జిల్లా ఎస్పీ జానకి షర్మిలను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పోలీస్ శాఖలో సిబ్బంది సంక్షేమం కోసం సంఘం బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు.

