కలం, వెబ్ డెస్క్: కొండా సురేఖ (Konda Surekha)ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి పంపించిన ఫైల్‌పై గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సంతకం చేశారు. తనను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుటే గవర్నర్ సంతకం చేయడం గమనార్హం. రాష్ట్ర మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తూ.. అధికారిక ప్రక్రియ పూర్తయినట్లయింది. దీంతో ఇక ఆమె మాజీ మంత్రిగా మారిపోయారు. ఉదయం నుంచి ఉత్కంఠభరితంగా మారిన పరిణామాల నేపథ్యంలో.. రాజీనామా చేసేందుకు కొండా సురేఖ ససేమిరా అన్నారు. దీంతో మంత్రి వర్గం నుంచి తొలగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
మూడు మంత్రి పదవులు ఖాళీ..
కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించడంతో మూడు మంత్రి పదవులు ఖాళీ అయినట్లయింది. దీంతో కొత్తగా ముగ్గురికి అమాత్య యోగం దక్కబోతుంది. ఈ నెల ఆరో తేదీన కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్సయినట్లు ఊహాగానాలొస్తున్నాయి. అందుకోసమే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలిసినట్లు చర్చ జరుగుతోంది. మంత్రి పదవుల కోసం ఆశావహులు సైతం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాల సమాచారం.

