కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులుగా సాయిని మల్లేశం (Saini Mallesham) నియమితులైన అనంతరం వ్యక్తిగత పనులపై గురువారం రోజున మొదటిసారిగా కరీంనగర్ కోర్టుకు విచ్చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు ఆత్మీయ స్వాగతం పలికి, ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రపాటి కిరణ్ కుమార్ శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
సీనియర్ న్యాయవాది, హుస్నాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా భాద్యతలు నిర్వహిస్తున్న సాయిని మల్లేశం.. కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులుగా నియామకమైన తర్వాత మొదటిసారిగా జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా లీగల్ సెల్ న్యాయవాదులతో పాటు సహచర న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు ఆత్మీయంగా పలకరించి అభినందనలు తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు గౌతమ్ రెడ్డి, కూర శ్రీనివాస్ రెడ్డి, బీవి రమణ, గుజ్జ సతీష్, లీగల్ సెల్ న్యాయవాదులు కటకం శ్రవణ్ కుమార్, కొలిపాక చంద్రమౌళి, సుగుర్తి జగదీశ్వరాచారి, వెన్న ఆనంద్, ముద్దసాని సంపత్, ఉషకోయిల రమేష్, గుంజెటి శివ, ముత్తునూరి హరీష్ రావ్, బండారి గాయత్రి, దీరజ్, సాయి చరణ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

