కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ, హమాలీ కార్మికుల ధర్నా

కలం, ​కరీంనగర్: జిల్లాలోని భవన నిర్మాణ రంగ, హమాలీ కార్మికులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్టియూ (BRTU Protest) ధర్నా చేపట్టింది. కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి (Bommidi Srinivas Reddy) ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికుల సంఘం, హమాలీ సంఘం ప్రతినిధులు పెద్దఎత్తున నిరసన తెలిపారు.

​ధర్నాను (BRTU Protest) ఉద్దేశించి బీఆర్టియూ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఎల్‌ఐసీ ద్వారా కాకుండా, నేరుగా బీఓసీ (BOC) సంక్షేమ బోర్డు నుంచే రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు దాటిన వయోవృద్ధ కార్మికులకు బీఓసీ బోర్డు ద్వారా నెలకు రూ. 5,000 చొప్పున పెన్షన్ మంజూరు చేయాలన్నారు.

సహజంగా మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడంతో పాటు, వివాహ కానుక, డెలివరీ ఖర్చులను రూ. 30,000 నుండి రూ. 60,000కు పెంచాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు దాన్ని విస్మరించిందని విమర్శించారు. వెంటనే హమాలీలు, లేబర్లు, ఐకేపీ సెంటర్లలో పనిచేసే కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని.. హమాలీ కార్మికులందరికీ ప్రాధాన్యతా క్రమంలో ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కోరారు.

రైస్ మిల్లులు, మార్కెట్ యార్డులు, ఐకెపి సెంటర్లలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన హమాలీ కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌కు అందజేశారు. ​ఈ నిరసన కార్యక్రమంలో భవన నిర్మాణ రంగ జిల్లా అధ్యక్షులు ఆకుల మల్లేశం, హమాలీ రంగం జిల్లా అధ్యక్షులు కొమిరే రాఘవులు, భవన నిర్మాణ రంగ నాయకులు ఇరుకుల్ల బాబు, ఇరుకుర్ల రవి, కందుల రాజమల్లు, కులాని కుమారస్వామి, కొత్త రాజేందర్, పప్పు సత్తయ్య, రామగిరి సంపత్, అలాగే హమాలీ రంగ నాయకులు కే. మల్లయ్య, డి. గోపాల్, శంకర్, అరుణ్, అనిల్, సురేందర్‌లతో పాటు దాదాపు 70 మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు.

Also Read : కొండా సురేఖకు కేఏ పాల్ బంప‌ర్ ఆఫ‌ర్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>