రామగిరి ఖిల్లా పర్యాటక అభివృద్ధికి అడుగులు

కలం, పెద్దపల్లి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు నిర్వహించిన ‘మన జిల్లా – మన రామగిరి’ కార్యక్రమంలో భాగంగా రామగిరి ఖిల్లా(Ramagiri Fort) వద్ద వాకింగ్, ట్రెక్కింగ్ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమాన్ని ఏసీపీ మడత రమేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ.. చారిత్రక ప్రాధాన్యత కలిగిన రామగిరి ఖిల్లా విశిష్టతను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, ఈ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలతో ప్రత్యేకత కలిగిన రామగిరి ఖిల్లాకు పర్యాటకులను ఆకర్షించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.

యువత, ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా వాకింగ్, ట్రెక్కింగ్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రామగిరి ఖిల్లాపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు చారిత్రక వారసత్వ పరిరక్షణపై అవగాహన కల్పిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 100 నుంచి 150 మంది వాకర్స్, ట్రెక్కర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 17 కిలోమీటర్ల మేర వాకింగ్, ట్రెక్కింగ్ పూర్తి చేశారు. పాల్గొన్నవారి ఉత్సాహం, ప్రకృతి పట్ల ఆసక్తి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రామగిరి ఖిల్లా పర్యాటక అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, చారిత్రక ప్రదేశాల విశిష్టతను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఏసీపీ మడత రమేష్ తెలిపారు.ట్రెక్కింగ్ అనంతరం నిర్వాహకులు మైపాల్ రెడ్డి ట్రెక్కింగ్ పూర్తి చేసిన వారికి మెడల్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, నిర్వాహకులు మైపాల్ రెడ్డి, సెక్షన్ పర్యవేక్షకులు విజయ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>