కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) పట్టణంలోని అంగడి బజార్లో హ్యాపీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరితంగా సాగాయి. సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో హ్యాపీ యూత్ అసోసియేషన్ సభ్యులు ఎర్ర చంద్రమౌళి, బోదాస్ ప్రకాష్, బుడద శ్రీకాంత్, కైరంకొండ సంతోష్, వడ్లకొండ సిద్దు, ఎర్రబాను, వి. ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

