కలం, వెబ్ డెస్క్ : మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ తరువాత కొండా సురేఖ (Konda Surekha) కాంగ్రెస్ అధిష్ఠానానికి సంచలన లేఖ పంపించారు. AICC అధ్యక్షుడు ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలకు 6 పేజీలతో కూడిన లేఖ రాశారు. తనపై రాజకీయ అణచివేత జరుగుతోందని అందులో ఫిర్యాదు చేశారు.
తన శాఖలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తనకు తెలియకుండానే సీఎం కార్యాలయం నుంచి జరుగుతున్నాయని సురేఖ (Konda Surekha) లేఖలో పేర్కొన్నారు. మంత్రిగా తన నిర్ణయాధికారం తగ్గిస్తూ నామమాత్రపు మంత్రిగా మార్చుతున్నారని లేఖలో ప్రస్తావించారు. తాను ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా, తన భర్త కొండా మురళీ రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారని లేఖలో కొండా సురేఖ వివరించారు.
పార్టీ సిద్ధాంతాలను, సూత్రాలను ఎల్లప్పుడూ నిలబెట్టామని.. ప్రజల సమస్యలపై పోరాడాం, సంస్థాగత బలోపేతానికి కృషి చేసినట్లు చెప్పుకొచ్చారు. రాజకీయంగా, తీవ్రంగా నిర్లక్ష్యానికి గురవుతున్నానని లేఖలో కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణయాధికారాన్ని, స్వతంత్ర పాత్రను క్రమంగా కుదించారని ఆమె ఆరోపించారు. తన శాఖలకు సంబంధించిన నిర్ణయాలపై సమాచారం ఇవ్వలేదని.. మంత్రిగా తన పాత్ర కేవలం నామమాత్రంగా మారిపోయిందని లేఖలో కొండా సురేఖ ప్రస్తావించారు.
Also Read : పార్టీకి రాజీనామాపై కొండా సురేఖ క్లారిటీ
Follow Us On: X(Twitter)

