వైఎస్సార్ కు నిజామాబాద్ లో కాంగ్రెస్ నేతల ఘన నివాళి

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో వైయస్ఆర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆయనను ఎప్పటికి మరచిపోలేరని కొనియాడారు.

ప్రజల మనస్సులో YSR అభివృద్ధి ఫలాలు..

వైఎస్సార్ చేసిన అభివృద్ధి ఫలాలు ప్రజల మనస్సులో చిర స్థాయిలో ఉంటాయని నగేష్ రెడ్డి పేర్కొన్నారు . నేడు ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి రాగానే మొదటగా రైతులకు 1200 కోట్లతో 24గంటల ఉచిత విద్యుత్ పైలుపై సంతకం చేసారని, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఉచిత వైద్యం కోసం 2 లక్షల పరిమితితో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ప్రవేశ పెట్టిన ఘనత రాజశేఖరరెడ్డి దని కొనియాడారు.

ఎవరెవరు పాల్గొన్నారంటే..

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హాందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు కౌడపు శరత్ కుమార్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్, జిల్లా ఎస్టీ అధ్యక్షులు యాదగిరి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్, జిల్లా ఫిషరీస్ అధ్యక్షులు శ్రీనివాస్, కార్పొరేటర్ ప్రవీణ్ గౌడ్, లవంగ ప్రమోద్, కుడ్డుస్, బంటు బలరాం, నరేంద్ర సింగ్, కౌడపు రఘు, లింభాద్రి సుభాష్, రాజ్ గగన్, ప్రవీణ్  తదితరులు పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>