పుణ్యక్షేత్రాల యాత్రకు నిర్మల్‌ ఆర్టీసీ డిపో శ్రీకారం

కలం, నిర్మల్: పుణ్యక్షేత్రాల సందర్శనకు నిర్మల్‌ ఆర్టీసీ డిపో (Nirmal RTC Depot) నుంచి ప్రత్యేక యాత్ర బస్సు బుధవారం బయలుదేరింది. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ యాత్రలో పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పించారు. నిర్మల్‌ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర అన్నవరం, సింహాచలం, కోణార్క్‌ మీదుగా పూరీ జగన్నాథ్‌ ఆలయానికి చేరుకోనుంది. అనంతరం అర్సవెల్లి, శ్రీకూర్మం, విశాఖపట్నం, ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రాలను యాత్రికులు దర్శించుకోనున్నారు. ఈ యాత్ర సెప్టెంబర్‌ 7న తిరిగి నిర్మల్‌కు చేరుకుంటుందని ఆర్టీసీ డిపో మేనేజర్‌ కే. పండరి తెలిపారు.

పుణ్యక్షేత్రాల యాత్రలకు (Pilgrimage Tour) ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోందని డిపో మేనేజర్‌ తెలిపారు. భక్తుల ఆదరణను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్‌ 20 తర్వాత మరో ప్రత్యేక యాత్ర బస్సును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ తదుపరి యాత్రలో సోమనాథ్‌, ద్వారకా, ఉజ్జయిని, ఓంకారేశ్వర్‌ తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు కే. పండరి తెలిపారు. భక్తులు ఆర్టీసీ అందిస్తున్న ప్రత్యేక యాత్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>