కలం, మెదక్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్దిపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్దిపేట (Siddipet) ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి స్థానిక బస్టాండ్ వరకు కాంగ్రెస్ హామీలతో కూడిన భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ ర్యాలీ (BRS Rally) గా వెళ్లారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీల అమలు తీరుపై ఫ్లెక్సీలో పలు ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వంపై సెటైర్లు, నినాదాలతో పాటు ఆకట్టుకునే యానిమేషన్ ఫోటోలను ఫ్లెక్సీలో పొందుపరిచి వినూత్నంగా తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజలను మభ్యపెట్టడమే లక్ష్యంగా పాలన సాగుతోందని విమర్శించారు.

