కలం, నిర్మల్: ఇంద్రవెల్లి (Indravelli) మండలానికి చెందిన అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ నాయకులు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సోంకాంబ్లే మనోహర్, మాజీ జాయింట్ సెక్రటరీ వాగ్మారే కామ్రాజ్, సింగరే భగవాన్ సందీప్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Bhojju Patel) వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తమ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి జహీర్, సోంకాంబ్లే జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

