కలం, మక్తల్ : నారాయణ పేట జిల్లా మక్తల్ (Makthal) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లను పట్టుకొని బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు మక్తల్ ఎస్సై రాజు యాదవ్ తెలిపారు. మక్తల్ మండలంలోని పెద్ద వాగు పరివాహక ప్రాంతాల నుంచి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం అనుమతించిన ప్రాంతాల నుంచి మాత్రమే నిబంధనలకు అనుగుణంగా ఇసుకను తరలించాలని ఆయన సూచించారు.

