మెస్సీ రిటైర్మెంట్.. రేవంత్ రెడ్డి ఎమోషనల్ పోస్ట్!

కలం, స్పోర్ట్స్ : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు ప్రకటించడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. మెస్సీ లేని ఫుట్‌బాల్‌ను ఊహించడం కష్టమని పేర్కొంటూ.. ఆయనకు వీడ్కోలు పలికారు. మెస్సీ ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉండాలని ఆకాంక్షించారు. మెస్సీ రెండు దశాబ్దాల పాటు అర్జెంటీనా తరఫున అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో కొనసాగారు. సోమవారం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. మెస్సీతో హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ మైదానంలో కొన్ని నిమిషాలు గడిపే అవకాశం తనకు లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. మెస్సీ ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులను అలరించడంతో పాటు ఉత్సాహపరిచి, స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు.

గత ఏడాది డిసెంబర్‌లో మెస్సీ ‘గోట్ ఇండియా టూర్ 2025’లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌తో కలిసి ‘గోట్ కప్’ పెనాల్టీ షూటౌట్‌లో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఫుట్‌బాల్ దుస్తుల్లో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే సమయంలో చిన్నారులతో నిర్వహించిన ఫుట్‌బాల్ క్లినిక్స్‌లో మెస్సీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మెస్సీతో హైదరాబాద్‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రేవంత్ రెడ్డి వీడ్కోలు సందేశం ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>