గ్రామాల అభివృద్ధిలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకం: చిన్నారెడ్డి

కలం, వనపర్తి: గ్రామాల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి (Chinna Reddy) అన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన రాజేంద్రప్రసాద్ యాదవ్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు, వనరులు అందించడం ద్వారా గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయవచ్చన్నది రాజీవ్‌ గాంధీ ఆలోచన అని గుర్తు చేశారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

పార్టీ కోసం కష్టపడి, నియమ నిబంధనలకు లోబడి పనిచేసే నాయకులకు పార్టీ అధిష్ఠానం తప్పకుండా గుర్తింపు ఇస్తుందని చిన్నారెడ్డి అన్నారు. రాజేంద్రప్రసాద్ యాదవ్ పార్టీకి చేసిన సేవలను గుర్తించే ఈ కీలక బాధ్యత అప్పగించడం అభినందనీయమని పేర్కొన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, రాష్ట్ర మైనార్టీ నాయకుడు అక్తర్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యాదవ్, కో-కోఆర్డినేటర్ చంద్రశేఖర్, ఏఐపీసీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ బాబా, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆవుల చంద్రశేఖర్, అనిల్, అయ్యవారిపల్లె సర్పంచ్ కురుమన్న, పలువురు నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>