పోలీసుల సంక్షేమంపై ఎస్పీ కీలక సూచనలు

కలం, నారాయణపేట: జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ సభ్యులంతా సమిష్టిగా పనిచేస్తూ పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ(Narayanpet SP) డాక్టర్ వినీత్ సూచించారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పోలీస్ అధికారుల సంఘం పూర్తి స్థాయి నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించారు. మెజార్టీ సభ్యుల ఓటుతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా నారాయణపేట సీఐ శివశంకర్, ఆర్‌ఎస్‌ఐ శివశంకర్, సెక్రటరీగా టౌన్ ఎస్‌ఐ ఏ. వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీగా మురళీకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, ట్రెజరర్‌గా రాజు ఎన్నికయ్యారు.ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి, కానిస్టేబుళ్లు యాదయ్య, పరంధాములు, శ్రీనివాసులు, రమేష్, మహేష్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ఎస్పీ వినీత్ మాట్లాడుతూ నూతన కార్యవర్గం పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సాధకబాధకాలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను సంఘం ప్రతినిధులు నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావడంతో పాటు విధి నిర్వహణలో క్రమశిక్షణ, బాధ్యత, నిబద్ధతతో వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా లేదా చట్టవిరుద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సంఘం కార్యకలాపాలు పోలీసు శాఖ నిబంధనలు, చట్టపరమైన పరిధిలోనే కొనసాగాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజుల్ హక్, డీఎస్పీ మహేష్, సీఐలు రామ్‌లాల్, సైదులు, భగవంత్‌రెడ్డి, ఎస్‌బీ ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>