వెలిగొండ క్రెడిట్ ఎవరిది?… లెక్కలతో సహా తెలిపిన సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్ : మార్కాపురం జిల్లాలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన వేళ సీఎం చంద్రబాబు (CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టును తానే ప్రారంభించానని, శంకుస్థాపన చేశానని చెప్పారు. ప్రాజెక్టుపై అయితే విపక్ష వైసీపీ ప్రచారం చూస్తే ఆవేదన కలుగుతోందని అన్నారు. ఈ ప్రాజెక్టుపై దాదాపు 50 శాతం ఖర్చు తానే చేశానని లెక్కలతో సహా చెప్పారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి కలిసి 11 ఏళ్లలో రూ. 2,175 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి రూ. 2,417 కోట్లు ఖర్చు చేయగా.. తాను ఏకంగా ప్రాజెక్టు కోసం రూ. 5562 కోట్లు ఖర్చు చేశానని వివరించారు. తన జీవితంలో పనులు చేయడం తప్ప రాజకీయాలు మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం మోసం చేసిన వ్యక్తిని నిలదీయకపోతే వాస్తవాలు మర్చిపోయే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.

సిగ్గులేని గొడ్డలి పార్టీకి మానవత్వం లేదని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. సినిమా సెట్టింగులు , ఫేక్ ప్రచారాలతో ఆటలాడుకున్నారని అన్నారు.2019లో గొడ్డలి పార్టీ రాకతో వెలిగొండకు గ్రహణం పట్టిందని ఆరోపించారు. అయితే ఎన్నికల ముందు ప్రాజెక్టు ప్రారంభించామని డ్రామా చేసిన వైసీపీ రూ. 4500 కోట్ల పనులు పెండింగ్ లో పెట్టిందని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ పనులు పూర్తి చేసి నేడు వెలిగొండ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>