కలం, నిర్మల్ : ముంబై దాదార్ (ఈస్ట్) నాయిగావ్ లో గల పద్మశాలి యువక సంఘం (Padmashali Yuvaka Association) 2026–29 సంవత్సరాలకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఆదివారం ఎన్నికల కమిటీ సమక్షంలో నిర్వహించిన సమావేశంలో పాలక మండలి, నిర్వహణ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాలక మండలి చైర్మన్ గా కోడం రవీంద్ర, మేనేజింగ్ ట్రస్టీగా దొంత శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
ట్రస్టీ సభ్యులుగా అనబత్తుల ప్రమోద్, కోడి చంద్ర మౌళి, పాపని సుదర్శన్, చెరిపెల్లి పరమేశ్వరి, నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా అనుమల్ల సుభాష్, ఉపాధ్యక్షులుగా పూల రామలింగం, పేర్ల కవిత, ప్రధాన కార్యదర్శిగా మహేశ్వరం చంద్రశేఖర్, సంయుక్త కార్యదర్శులుగా అంకం వెంకటేశ్, వంగరి పరమేశ్వర్, పున్న లావణ్య, కోశాధికారిగా బోడ శ్రీనివాస్, సహాయ కోశాధికారిగా పుట్ట గణేశ్, కమిటీ సభ్యులుగా అనబత్తుల సిద్ధరాం, దేవళ్ల రామచంద్ర, దోమల శంకర్, కైరంకొండ ప్రవీణ్‌కుమార్, కర్నాటి శ్రీను, కొండ రాజేంద్రప్రసాద్, మంచె శ్రీనివాస్, పేర్ల దిలీప్, సీత మహేశ్ ఎన్నికయ్యారు.

