‘సెన్సస్ హ్యాండ్‌బుక్’ సమాచారాన్ని ఆన్‌‌లైన్ చేయాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్: ‘సెన్సస్ హ్యాండ్ బుక్’ (Census Handbook) మ్యానువల్ సమాచారం మొత్తాన్ని ఆన్ లైన్ చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శనివారం నిజామాబాద్ నుంచి జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో సెన్సస్ హ్యాండ్ బుక్ రూపకల్పనపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన (Bhavesh Mishra) మండలాలు, మున్సిపాలిటీల వారిగా ఇప్పటివరకు సేకరించిన నిర్దేశిత సమాచారం, ఇంకా సేకరించాల్సిన వివరాలు అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సేకరించిన సమాచారాన్ని మొత్తం నిర్దేశిత ప్రొఫార్మాలో ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. ఈ వీసీలో జిల్లా కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, సిపిఓ గంగారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also Read : మద్యం మత్తులో మహిళపై దారుణం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>