ఫీజు బకాయిలపై బీజేపీ ఫైర్.. సీఎం దిష్టిబొమ్మ దహనం

కలం, కరీంనగర్: విద్యార్థుల ఫీజు బకాయిల (Fee Reimbursement) సమస్యపై భారతీయ జనతా పార్టీ (Karimnagar BJP) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం కరీంనగర్ గీతా భవన్ చౌరస్తా వద్ద తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం నేతృత్వంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నించగా, అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.

పోలీసుల వలయాలను దాటుకుని ముందుకు వెళ్లిన బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం (Saini Mallesham)తో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవితతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలన్నారు. సమస్య పరిష్కారమయ్యే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విడిచి పెట్టే ప్రసక్తి లేదని మల్లేశం హెచ్చరించారు. విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందని, బకాయిలు విడుదల చేసే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు మాడ వెంకట్ రెడ్డి, తాళ్ల పెళ్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి, ఎర్రబెల్లి సంపత్ రావు, భింగి వేణు, గుజ్జ శ్రీనివాస్ రావు, కార్యదర్శి సిహెచ్ నరసింహ రాజు, అధికార ప్రతినిధిలు బొంతల కల్యాణ్ చంద్ర, ఊగులే సుధాకర్, దుర్శెట్టి సంపత్ యువ మోర్ఛ అధ్యక్షులు సంగ నరేష్, ఓబీసీ మోర్ఛ అధ్యక్షులు ఆకుల రాజేందర్, ఎస్టీ మోర్చ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, కనుమల్ల గణపతి ఓబీసీ మోర్చ రాష్ట కార్యదర్శి అడిచెర్ల రాజు మండల, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేడ్ల ప్రవీణ్ రెడ్డీ అధ్యక్షులు మడిశెట్టి సంతోష్, మల్లేశం చింతం శ్రీనివాస్ పర్షరాములు, కోలిపాక రాజు తణుకు సాయికృష్ణ, జాడి బాలరెడ్డి, బండారి గాయత్రి, శివరాజ్, కొలకని రాజు, అవుధూర్తి శ్రీనివాస్, రాష్ట కౌన్సిల్ సభ్యులు పుప్పాల రఘు దండు కొమురయ్య, ముత్యాల జగన్, గాజుల స్వప్న, మామిడి చైతన్య, ఎలుకపల్లి రమేష్, బిజిలి సారయ్య, నక్కా ప్రమోద్, గంగిశెట్టి రాజు, జీడి మల్లేష్, కోలా అశోక్ కచకయల రాజు, బోయిన శ్రీనివాస్, విమల్, వినీత్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : పాలమూరుకు ‘బ్రహ్మాస్త్రం’.. రూ 500 కోట్లతో 416 ఎకరాల్లో ఏర్పాటు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>