మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నోటీస్.. కారణమిదే!

కలం, కరీంనగర్ బ్యూరో: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు (Ponnam Prabhakar) సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్వో అధికారులు నోటీస్ జారీ చేశారు. ఓటర్ల జాబితాలో మంత్రి తండ్రి పేరు తప్పుగా నమోదైన నేపథ్యంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో నోటీస్ అందించారు. వెంటనే స్పందించిన పొన్నం తన తండ్రి పేరును సక్రమంగా సవరించాలని కోరుతూ అవసరమైన ధ్రువీకరణ పత్రాలను బీఎల్వో అధికారులకు అందజేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్నికల అధికారులు ప్రతి ఓటరు వివరాలను పరిశీలిస్తూ, తప్పులు ఉన్నచోట సవరణలు చేపడుతున్నారని మంత్రి తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను పరిశీలించుకుని, ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత అధికారులను ఆధారాలతో సంప్రదించి సరిచేసుకోవాలని మంత్రి సూచించారు. తన విషయంలోనూ నిబంధనల ప్రకారమే నోటీస్ అందుకుని, అవసరమైన పత్రాలను వెంటనే సమర్పించినట్లు మంత్రి తెలిపారు. ఎన్నికల అధికారులు వాటిని పరిశీలించి తండ్రి పేరులో ఉన్న తప్పును సరిచేయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>