విశ్రాంత జీవితాన్ని సామాజిక సేవకు అంకితం చేయాలి: మాజీ ఎంపీ రావుల

కలం, వనపర్తి: పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ విశ్రాంత సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సామాజిక సేవా కార్యక్రమాలు, వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్‌ఎస్‌ నాయకుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి (Ravula Chandrasekhar Reddy) సూచించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో 32 ఏళ్లపాటు సేవలందించి సోమవారం పదవీ విరమణ చేస్తున్న తలారి వెంకటస్వామిని వనపర్తి భగీరథ కాలనీలోని ఆయన నివాసంలో చంద్రశేఖర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ విధుల్లో చూపిన అంకితభావాన్ని సామాజిక సేవలోనూ కొనసాగించాలని అన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో వెంకటస్వామి అందించిన సేవలను కొనియాడుతూ వినియోగదారులతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని, సేవా స్ఫూర్తిని అభినందించారు. కార్యక్రమంలో సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు నందిమల్ల అశోక్‌, ఆర్‌.సి.రమేష్‌చంద్ర, బైరోజు చంద్రశేఖర్‌, బండారు శ్రీనివాస్‌, డా.కంటే నిరంజనయ్య, డా. బి.శ్యాంసుందర్‌, కౌసల్య, ప్రవీణ్‌, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>