మనుషుల రికార్డులు బద్దలు కొట్టిన రోబోలు!

కలం, స్పోర్ట్స్: రోబోలు ఇప్పుడు కేవలం పరుగెత్తడం కాదు.. మనుషుల పనులకూ దగ్గరవుతున్నాయి. బీజింగ్‌లో (Beijing) జరిగిన రెండో వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ ఈ మార్పును మరోసారి చూపించాయి. తాజాగా వచ్చిన అప్‌డేట్ల ప్రకారం, రోబోట్ల వేగం మాత్రమే కాదు.. నిజ జీవిత పనుల్లో వాటి సామర్థ్యం కూడా పెరుగుతోంది. ఆగస్టు 22 నుంచి 26 వరకు జరిగిన ఈ గేమ్స్‌లో 16 దేశాల నుంచి 666 జట్లు పాల్గొన్నాయి. 2,000కు పైగా రోబోలు పోటీపడ్డాయి. పరుగులో రోబోలు సంచలనం సృష్టించాయి. 100 మీటర్ల రేసులో టియాన్‌గాంగ్ అల్ట్రా 8.64 సెకన్లతో కొత్త రికార్డు నమోదు చేసింది.

అంతకుముందు ఇదే పోటీలో 9.39 సెకన్ల రికార్డు నమోదైంది. మానవుల 100 మీటర్ల ప్రపంచ రికార్డును కూడా రోబోలు దాటాయి. అయితే వేగం పెరిగినా వాటికి కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి. రేసు తర్వాత కొన్ని రోబోలు అదుపు తప్పి కూలిపోయాయి. అసలు ఆసక్తికరమైన విషయం క్రీడల బయట కనిపించింది. ఈ గేమ్స్‌లో రోబోలు ప్యాకింగ్, గార్డెనింగ్, ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ వంటి పనులు చేశాయి. రిటైల్ సేవలు, పరిశ్రమల్లో అసెంబ్లింగ్ పనుల్లోనూ పాల్గొన్నాయి.

కిచెన్‌లో కూరగాయలు కోయడం, ఆహారం తయారు చేయడం వంటి పనులనూ రోబోలు ప్రదర్శించాయి. షాపులో సేల్స్ సిబ్బందిలా పనిచేసిన రోబోలు కూడా కనిపించాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫైర్ రెస్క్యూ పోటీ కూడా నిర్వహించారు. ప్రమాదకర ప్రాంతాల్లో మనుషులకు బదులుగా రోబోలను ఉపయోగించే అవకాశాన్ని ఇది చూపించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రోబోల సామర్థ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. ఫుట్‌బాల్‌లో షూటింగ్, పాసింగ్‌లోనూ పురోగతి నమోదైంది.

అయితే రోబోలు ఇంకా పూర్తిగా మనుషులకు ప్రత్యామ్నాయం కాలేదు. వేగం, కదలికలతో పాటు క్లిష్టమైన పరిస్థితుల్లో సొంతంగా నిర్ణయం తీసుకోవడం, సురక్షితంగా పనిచేయడం వంటి అంశాల్లో ఇంకా అభివృద్ధి అవసరం ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. బీజింగ్ గేమ్స్ మాత్రం ఒక విషయం స్పష్టం చేశాయి. హ్యూమనాయిడ్ రోబోలు ప్రయోగశాలల నుంచి బయటకు వచ్చి క్రమంగా నిజ జీవిత పనుల వైపు అడుగులు వేస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>