మంత్రి అడ్లూరికి రాఖీ కట్టిన సోదరీమణులు

కలం, కరీంనగర్ బ్యూరో: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ధర్మపురి శిబిర కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ (Adluri Laxman)ను స్థానిక కౌన్సిలర్లు, నియోజకవర్గానికి చెందిన సోదరీమణులు కలిసి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సోదరీమణులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. సోదరీమణుల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు తనకు ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>