కలం, కరీంనగర్: అన్నా చెల్లెల అనుబంధానికి రాఖీ ప్రతీకగా నిలుస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ (Putta Madhukar) అన్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని శుక్రవారం మంథనిలోని రాజగృహాలో రక్షా బంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సోదరీమణులు శంకరమ్మ, శశికళ లు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనాదిగా రాఖీ పండుగకు ఒక ప్రత్యేకత ఉందని, అక్కకు, చెల్లెకు ప్రాణం పోయేవరకు తోడుగా ఉంటానని భరోసా కల్పించేలా రాఖీ కడుతారని ఆయన తెలిపారు.
రాఖీ పండుగతో సోదరబావం పెంపొందుతుందని, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు రాఖీ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారని అన్నారు. నాకు నీవు రక్షా…నేను నీకు రక్షా అంటూ ఆప్యాయతను చాటుతూ అన్నయ్యకు చెల్లెల్లు, తమ్ముళ్లకు అక్కలు రాఖీలు కడుతారని ఆయన వివరించారు. అనంతరం పలువురు మహిళలు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌కు రాఖీలు కట్టారు. అలాగే మంథని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పుట్ట శైలజ పలువురు ముస్లిం, మైనార్టీ నాయకులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంథని నియోజకవర్గ ప్రజలకు, సోదరీమణులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

