కలం, వెబ్ డెస్క్ : రాక్షాబంధన్ వేడుకల సందర్భంగా తెలంగాణ రాజకీయాల్లో ఆత్మీయ దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనకు రాఖీ కట్టారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లిన అనంతరం సీఎంకు రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆత్మీయ కలయికకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది.
సీఎంకు రాఖీ కట్టినవారిలో కొండా సురేఖతో పాటు మరో మంత్రి సీతక్క, మహిళా కమిషన్ చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి, సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బ్రహ్మకుమారీస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, మలక్ పేట్ లోని గవర్నమెంట్ హైస్కూల్ ఫర్ ది బ్లైండ్ గర్ల్స్ విద్యార్థినిలు ఉన్నారు.

