ప‌ల్నాడులో టీచ‌ర్‌పై యువ‌కుల దాడి!

క‌లం, వెబ్‌డెస్క్: పల్నాడు (Palnadu) జిల్లా పెదకూరపాడులో ఓ ఉపాధ్యాయుడిపై యువకులు అమానుషంగా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉపాధ్యాయుడు జంపని నరేష్ బాబు కారులో గుంటూరు నుంచి పెదకూరపాడులోని పాఠశాలకు వెళ్తున్నాడు. ఈ సమయంలో బైక్​ పై వెళ్తున్న యువకులను స్వల్పంగా ఢీకొట్టారు. దీంతో ఈ వివాదం చెలరేగింది. దీనిపై పాఠశాలకు వెళ్లి అక్కడ మాట్లాడుకుందామని నరేష్ బాబు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా యువకులు వినకుండా ఆయన కారును వెంబడించారు.

అనంతరం పాఠశాల రోడ్డు వద్ద కారుకు బైక్​ను అడ్డుపెట్టి ఉపాధ్యాయుడిని బలవంతంగా కిందకు లాగి దాడికి పాల్పడ్డారు. చేతులతో పాటు కొబ్బరి మట్టలతో తనపై విచక్షణారహితంగా దాడి చేశారని బాధితుడు నరేష్ బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>