వరద సాయం.. నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : భారీ వరదలతో (Nepal Floods) అల్లాడుతున్న నేపాల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వచ్చే సహాయక చర్యలు, రెస్క్యూ బృందాల ప్రతిపాదనలను నేపాల్ ప్రభుత్వం అధికారికంగా తిరస్కరించింది. నేపాల్ భద్రతా దళాలే స్వయంగా రెస్క్యూ ఆపరేషన్‌ను సమర్థవంతంగా నిర్వహించగలవని తెలిపింది.

భారత్, అమెరికా, బ్రిటన్, చైనా వంటి అనేక దేశాలు తమ రెస్క్యూ బృందాలను పంపేందుకు ముందుకు వచ్చినా నేపాల్ వాటిని వద్దని స్పష్టం చేసింది. 2015 భూకంప సమయంలో విదేశీ బృందాల రద్దీ వల్ల తలెత్తిన సమన్వయ లోపాలు, ఇతర ఇబ్బందుల అనుభవాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.

విదేశీ రెస్క్యూ బృందాలను నిరాకరించినప్పటికీ, అంతర్జాతీయ రక్షణ, పునరావాస సహాయాన్ని నేపాల్ ఆహ్వానిస్తోంది. ఎలాంటి విదేశీ ఆర్థిక సాయమైనా సరే నేరుగా ‘ప్రధానమంత్రి సహాయ నిధి’ (PM Relief Fund) ద్వారా మాత్రమే అందించాలని తెలిపింది. ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ‘వన్-డోర్’ (One-door) విధానంలో సాయాన్ని సేకరించనుంది.

మరోవైపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన విదేశీయుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సుమారు 200 మందికి పైగా భారతీయులు తమను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. నేపాల్ పోలీసుల లెక్కల ప్రకారం దాదాపు 178 మంది భారతీయులు ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారికంగా నమోదైంది. ప్రస్తుతం నేపాల్ సైన్యం, స్థానిక దళాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>