ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ: కలెక్టర్ భవేష్ మిశ్రా

కలం, నిర్మల్ : రాఖీ పండగ (రక్షాబంధన్) సందర్భంగా నిర్మల్ జిల్లా ప్రజలందరికీ కలెక్టర్(Nirmal Collector) భవేష్ మిశ్రా (Bhavesh Mishra) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ పండుగ మహిళలకు రక్షణ, గౌరవం కల్పించాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఈ రాఖీ పండగ ప్రతి కుటుంబంలో ప్రేమ, ఆప్యాయతలను మరింత పెంపొందించాలని.. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>