కలం, జగిత్యాల : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నూతన కార్యవర్గ ఎన్నికల సమావేశం సీనియర్ వైద్యులు డాక్టర్ డా. అనూప్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఐఎంఏ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోరుట్ల ఐఎంఏ (IMA Korutla) అధ్యక్షుడిగా డాక్టర్ వేముల రవికిరణ్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పసునూరి మనోజ్ కుమార్, కోశాధికారిగా డాక్టర్ ముక్క ఇంద్రనీల్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ రమేష్, సహాయ కార్యదర్శిగా డాక్టర్ నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వేముల రవి కిరణ్ మాట్లాడుతూ వైద్యుల వృత్తిపరమైన భద్రత, సంక్షేమం, గౌరవం, సామాజిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. సభ్యుల మధ్య ఐక్యతను పెంపొందిస్తూ, ప్రతి వైద్యుడికి ఐఎంఏ అండగా నిలిచేలా కార్యక్రమాలను రూపొందిస్తామని అన్నారు. అదేవిధంగా వైద్య రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, నూతన వైద్య విధానాలు, సాంకేతిక పరిజ్ఞానంపై వైద్యులకు అవగాహన కల్పించేందుకు నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలు, సదస్సులు, శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తానని అన్నారు.
ఈ సమావేశంలో డా.అనూప్ రావు, డాక్టర్ మహాదేవ్, డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శంకర్, డాక్టర్ రేగొండ రాజేష్, డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ అన్వేష్, డాక్టర్ సంపత్, డాక్టర్ అశోక్ తదితర వైద్యులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గానికి సభ్యుల సహకారం, సూచనలు అందించాలని కోరుతూ, అందరి భాగస్వామ్యంతో ఐఎంఏను మరింత శక్తివంతమైన వేదికగా తీర్చిదిద్దుతామని వారు తెలిపారు.

