హనుమకొండ డిపోలో కార్గో పార్సిళ్ల వేలం

కలం, హనుమకొండ : వరంగల్ ఆర్టీసీ కార్గో పార్సిల్ కార్యాలయంలో వినియోగదారులు తీసుకెళ్లకుండా మిగిలిపోయిన వస్తువులను ఈ నెల 29న వేలం వేయనున్నట్లు హనుమకొండ డిపో (Hanumakonda Depot) మేనేజర్ భూక్యా ధర్మసింగ్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వరంగల్‌కు బుకింగ్ చేసినప్పటికీ, వినియోగదారులు తీసుకెళ్లని పార్సిళ్లు కాలపరిమితి దాటిన నేపథ్యంలో వేలానికి ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు హనుమకొండ డిపోలో వేలం నిర్వహించనున్నట్లు డీఎం తెలిపారు. ఆసక్తి ఉన్న వారు వేలంపాటలో పాల్గొనాలని ఆయన కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>