కలం, మహబూబ్ నగర్ బ్యూరో : సర్ పున పరిశీలన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని మహబూబ్‌నగర్ డిసిసి అధ్యక్షుడు సంజీవ ముదిరాజ్ (Sanjeev Mudiraj) పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని2వ, 49వ, 47వ, 60వ డివిజన్లలో నిర్వహించిన వార్డు సభ కార్యక్రమాల్లో ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా పునఃపరిశీలన ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ, పునఃపరిశీలన సమయంలో ప్రజలకు ఏవైనా ఇబ్బందులు , సమస్యలు ఎదురైతే స్థానిక కార్పొరేటర్‌ను, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను , సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.
ప్రజలకు అవసరమైన సహకారం అందించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ వార్డు సభ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ, టి.రామారావు గౌడ్ డీసీసీ ఉపాధ్యక్షుడు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, పీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ, బీఎల్‌ఎలు, బీఎల్‌ఓలు, వార్డు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

