జబర్దస్త్ నటి బర్త్‌డే వేడుకలో ఘర్షణ: టీడీపీ నేతపై దాడి!

కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాం సమీపంలోని హ్యాపీ నేచర్ రిసార్ట్స్‌లో జబర్దస్త్ ఫేమ్ నటి అను పుట్టినరోజు వేడుకలు (Vizag Rave Party) ఉద్రిక్తతకు దారితీశాయి. పార్టీలో పాల్గొన్న టీడీపీ, TNSF నాయకులు మద్యం మత్తులో మహిళల విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఈ గొడవలో చరణ్ తేజ్ అనే నాయకుడు టీడీపీ నేత వెంకట దినేష్‌పై కత్తితో దాడి చేశాడు.

తీవ్రంగా గాయపడిన దినేష్‌ను ప్రస్తుతం విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఘటనపై ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>