కరీంనగర్‌లో ‘తల్వార్’ బర్త్‌డే హంగామా!

కలం, కరీంనగర్ బ్యూరో: నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ జన్మదిన వేడుకలు నగరంలో తీవ్ర సంచలనంగా మారాయి. అభిమానులు, కార్యకర్తల కోలాహలం నడుమ మేయర్ చేతికి ‘తల్వార్’ పట్టడం చర్చనీయాంశమైంది. కరీంనగర్ నడిబొడ్డున తెలంగాణ చౌరస్తాలో బహిరంగ ప్రదేశంలో ఆయన తల్వార్ ప్రదర్శించడం, కేక్ కట్ చేయడం పౌరులను, రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. శ్రేణుల్లో తీవ్ర ఉత్సాహాన్ని నింపినప్పటికీ వివాదాస్పదమవుతోంది.! కరీంనగర్లో గతంలో సాధారణ పౌరుల విషయంలో ఇటువంటి వేడుకల్లో తల్వార్లు కత్తులు ప్రదర్శించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే నగర ప్రథమ పౌరుడు బహిరంగ ప్రదేశంలో తల్వార్ ప్రదర్శించడం దేనికి సంకేతం అన్న ప్రశ్న లేవనెత్తుతోంది.

అనంతరం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆశీస్సులు అందుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఉచిత వైద్య శిబిరాలు, వృద్ధాశ్రమాల్లో అన్నదానం, మొక్కలు నాటే కార్యక్రమాలను మేయర్ స్వయంగా పర్యవేక్షించారు. ​”ప్రజల నమ్మకమే నా బలం. నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఈ పట్టుదలతోనే ముందుకు సాగుతాను” అని మేయర్ స్పష్టం చేశారు. కాగా బహిరంగ ప్రదేశంలో తల్వార్ ప్రదర్శన రాజకీయంగా చురుకైన చర్చకు దారితీసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>