కలం, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగాల్సిన ఏపీ మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting) తేదీలో మళ్లీ మార్పు చోటు చేసుకుంది. సెప్టెంబర్ 2న జరగాల్సిన కేబినెట్ భేటీని 3కి బదిలీ అయింది. దీంతో సెప్టెంబర్ 3న ఉదయం 10: 30 గంటలకు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగనుంది.
అయితే అన్నింటికి కంటే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 8న ఏపీ కేబినెట్ భేటీ జరగాల్సి ఉండేది. ఆ తర్వాత అనుహ్యంగా తేదీని సెప్టెంబర్ 2కి మార్చారు. ఇక తాజాగా ఏపీ కేబినెట్ భేటీ(AP Cabinet Meeting)ని సెప్టెంబర్ 3కి బదిలీ చేశారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రి వర్గం చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో వివిధ శాఖలు తమ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు, కొత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, అమలు తీరుపై నివేదికలను సిద్ధం చేయనున్నాయి. కేబినెట్ సమావేశానికి ముందు ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలను సేకరించి, వాటిని పరిశీలించిన అనంతరం కేబినెట్ ముందుకు తీసుకురానున్నారు.
Also Read : తెలంగాణ యువ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్
Follow Us On: X(Twitter)

