కరీంనగర్‌లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు

కలం, కరీంనగర్: మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ (Karimnagar) నగరంలో ముస్లింలు బుధవారం మిలాద్ ఉన్ నబీ వేడుకలను (Milad-un-Nabi Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీ నిర్వహించి ప్రవక్తను స్మరించుకున్నారు. ఉదయం హుస్సేనీపురలోని బొంబాయి స్కూల్‌లో ఆసారే ముబారక్ దర్శనం అనంతరం మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ర్యాలీని మర్కజి మిలాద్ కమిటీ అధ్యక్షుడు ఫరీదా బాబా, ప్రధాన కార్యదర్శి గులాం రబ్బాని ఖాద్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం హిందూ–ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తూ గంగా–జమునా తెహజీబ్‌ను కాపాడటంలో ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. మహ్మద్ ప్రవక్త జీవితం యావత్ మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రవక్త చూపిన శాంతి, సోదరభావం, మానవత్వం మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన బోధనలను ఆచరిస్తూ జీవితాన్ని పునీతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నగరంలో భక్తిశ్రద్ధలు, సందడి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>