అమెరికాలో ప్రమాదం: తెలంగాణ విద్యార్థులు మృతి!

కలం, వెబ్ డెస్క్ : అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం (Florida Accident)లో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్ అనే యువకుడు ఉన్నాడు. ఉన్నత చదువుల కోసం మూడు నెలల క్రితమే అమెరికా వెళ్లిన రాహుల్, ఇలా అకస్మాత్తుగా ప్రమాదంలో మరణించడంతో అతడి కుటుంబంలో విషాదం అలముకుంది.

తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న కారు ఒక చెట్టును బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు వాహనంలో ఉన్న ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వర్గాల ద్వారా సమాచారం అందింది. ప్రమాదం జరిగిన విషయాన్ని అమెరికా అధికారులు బాధిత కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తమ బిడ్డల మరణ వార్త విన్న కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. రాహుల్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు వేడుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>