కలం, వెబ్ డెస్క్ : వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై తెలంగాణ మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు (Hanumantha Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్యులర్ దేశామైన భారత్ లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యం కాదని చెప్పారు. భారతదేశంలో భిన్న మతాలు, భిన్న కులాలు ఉన్నాయని వీహెచ్ గుర్తు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కాంగ్రెస్ వ్యతిరేకమని గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీహెచ్ వెల్లడించారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో మోదీ నాలుగోసారి ప్రధాని కావాలని చూస్తున్నారని, ఆ కల నెరవేరదని వీహెచ్ అన్నారు. అటు కేంద్రం చేస్తున్న కులగణనలో బీసీలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. కేంద్రం కులగణనలో బీసీల కాలమే లేదని ఆరోపించారు. కులగణలో 70 శాతం ఉన్న బీసీలకు అన్యాయం చేస్తారా? అని కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం ముందు కులగణన చేసి బీసీల వాటా తేల్చాలని హితవు పలికారు.

