కలం, వెబ్ డెస్క్: బీహార్లో (Bihar) 70వ బీపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని కోరుతూ ఆరేళ్ల బాలుడు పోస్టర్ పట్టుకున్నాడు. దీంతో ఆ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాలుడి చేతిలో మోదీ రాజీనామా చేయాలంటూ రాసిన పోస్టర్ ఉండటంతో ఇందుకు కారణంగా తెలుస్తోంది. 70వ బీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైన రీతిలో మళ్లీ నిర్వహించాలన్నారు. అయితే ఆరేళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

